ఫోటో న్యూస్ : మిర్యాలగూడ పట్టణంలో ఫోటో అండ్ విడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు . ఈ ఎన్నికల్లో చక్రి ప్యానల్ ఘన విజయం సాధించారు . ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మిర్యాలగూడ డివిజన్ ఫోటోగ్రాఫర్ సోదరులకు ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు . అలాగే ఈ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎంతో కష్టపడి నిర్వహించిన ఎన్నికల కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . .ఈ విజయం కేవలం మీ యొక్క సహకరం ద్వారానే సాధ్యమైందని అన్నారు . అదేవిధంగా వారి మీద నమ్మకం ఉంచి వారిని పోటీలో పాల్గొనాలి అని ప్రోత్సహించిన సీనియర్లకు,జూనియర్లకు, మా గెలుపు కోసం కృషి చేసిన మా మిత్రులకు,మా మీద నమ్మకం ఉంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి ఓట్ వేసిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్,విడియోగ్రాఫర్,ఆల్బమ్ డిజైనర్,వీడియో ఎడిటర్స్,లామినేషన్,కలర్ లాబ్స్ MD లు,అందులో పనిచేసే స్టాఫ్,డ్రోన్ ఆపరేటర్లు, LED వాల్ ఓనర్స్,ఫ్లెక్సీ షాప్ ఓనర్స్,అలాగే దామరచర్ల,వేములపల్లి, అడవిదేవులపల్లి,ఇలా పక్క గ్రామాల నుంచి నా ఒక్క ఓట్ కూడా విలువైనది అని మమ్మల్ని గెలిపించాలని వచ్చి ఓట్ వేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు . మీ యొక్క సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలి కోరుకుంటూ ,అతి త్వరలో మా కార్యాచరణ మీ అందరికి తెలియజేస్తాము అన్నారు . .మిర్యాలగూడ ఫోటో విడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా ఎన్నికైన గంధం నాగరాజు కి, మరియు ప్రధాన కార్యదర్శి లక్ష్మన్ కి ,కోశాధికారి నాగార్జున్ కి, నాగర్ కర్నూల్ జిల్లా గౌరవ సలహాదారులు కోలంటి భీమాచారి ఫోటో&వీడియోగ్రాఫర్స్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు .
Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network
Add my business arrow_forwardCopyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India